స్టార్ డైరెక్టర్ R. చంద్రు మాట్లాడుతూ నేను రియల్ స్టార్ ఉపేంద్ర కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు హిట్లు ఇచ్చాను, ఇక హ్యాట్రిక్ హిట్ సూపర్ డూపర్ హిట్ కొట్టాలని సిన్సియర్ గా తపస్సులా ప్రయత్నిస్తున్నానని అన్నారు. కబ్జా చిత్రంలో 1950 నుండి 1980 ఆనాటి దేశ కాల పరిస్థితులు, ఆనాటి పాత్రల వేషధారణ, బాష, ఆనాటి అలవాట్లు యధాతధంగా పునఃసృష్టి చేసే బాగంలో అప్పటి కార్లు గానీ, రిక్షాలు గానీ టాంగాలు గానీ, ఆటోలు గానీ విపరీతమైన శ్రద్ద తీసుకుంటూ R. చంద్రు ప్రతీ సన్నివేశాన్ని చాలా detailed గా సంతృప్తిగా సంపూర్ణంగా ఎలాంటి రాజీ పడకుండా చిత్రీకరించడంలో విశేష కృషి చేస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రాన్ని 200 రోజుల్లో తీర్చిదిద్దబోతున్నారు.
December 2019 లో ఈ కబ్జా చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది
రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇంతవరకూ తాను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అని, కబ్జా చిత్రంలో...