Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

డాక్టర్ రాజకుమార్ గంధడ గుడి లో, అలాగే అమితాబ్ బచ్చన్ షోలే లో ఉపయోగించిన అలనాటి పిస్టల్, మళ్ళీ తిరిగి 2020 లో R. చంద్రు, రియల్ స్టార్ ఉపేంద్ర కాంబినేషన్ లో వస్తున్న ఈ కబ్జా చిత్రంలో 1947 పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేకంగా ఆ గన్ వాడుతుండటం గొప్ప విశేషం.

Written by BATS Creations

September 15, 2020

Source :-

షోలే లో అమితాబ్ బచ్చన్, గంధడ గుడి లో డాక్టర్ రాజ కుమార్ ఉపయోగించిన పిస్టల్ ని రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా సినిమాలో ఉపయోగించడం గొప్ప వండర్ఫుల్ విషయమని స్వీయంగా తనే ట్వీట్ చేశారు. రియల్ స్టార్ ఉపేంద్ర ట్వీట్ చేసిన ఆ న్యూస్ సోషల్ మీడియా లో గొప్పగా వైరల్ అయ్యింది. సంచలనం సృష్టించింది. ఇలాంటి ఎన్నో విశేషాల సమాహారం ఈ కబ్జా చిత్రం అంచనాలని అంబరానికి అంటేలా చేస్తుంది. అన్ని రంగాల ప్రేక్షకుల్లో హైప్ ని తీసుకొస్తుంది. మరో విశేషం చెప్తూ డైరెక్టర్ R. చంద్రు ముఖ్యంగా బెంగుళూరు గన్ హౌస్ నుంచి ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే తెప్పించిన స్పెషల్ గన్స్ కబ్జా చిత్రానికి హైలెట్ అవుతాయని అన్నారు. దాదాపు కబ్జా షూటింగ్ ఐదు దశల్లో 200 రోజుల్లో జరగబోతోంది. ఆల్రెడీ 35 రోజులు షూట్ చేశారు ఇంకా 165 రోజులు దాదాపు 170 రోజులు వరకు చేయొచ్చు. బెంగళూర్ గన్ హౌస్ వారు ఈ చిత్రంలో ఐదు దశల్లో 175 రోజుల్లో తమ గన్స్ వాడటానికి అనుమతించటం విశేషం. ఇప్పటికే కబ్జా లో అతి ముఖ్యమైన, అతి క్లిష్టమైన థ్రిల్లింగ్ ఎపిసోడ్ 35 రోజులు నాన్ స్టాప్ గా యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారు. అంతేకాదు ఆ 35 రోజుల షూటింగ్ లో డ్రామా సీన్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సీన్స్ ఉన్నాయి, ఆ షూటింగ్ ఆద్యంతం successful గా పూర్తి చేశారు. శ్రీ సిద్దేశ్వర enterprises బ్యానర్ MTB నాగరాజు గారు నిర్మిస్తున్న కబ్జా చిత్రం 2021 లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ MTB నాగరాజు గారు ఒక ప్రముఖ politician Ex-Minister ప్రస్తుతం MLC businessman చాలా గ్లామర్ ఉన్న one of the richest men in India. ప్రముఖ star heroine ఈ చిత్రం లో కథానాయికగా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని కన్నడంలో నిర్మించబోతున్నారు, ఇదే సమయంలో తెలుగు, హింది, మలయాళం. మరాఠీ, ఒరియా బాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారీవ్యయంతో కూడుకున్న ఈ చిత్రం ప్రముఖ ఛాయాగ్రాహకుడు అర్జున్ శెట్టి ఈ చిత్రానికి cinematographer గా పని చేస్తున్నారు. అలాగే 1945 నుండీ 1985 దాకా భారతదేశంలో వివిధ నగరాల్లో జరిగిన మాఫియా activities ని research చేసి కథ తయారుచేసుకుని ఆ నేపధ్యంలో కబ్జా చిత్రం నిర్మిస్తున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తున్న కబ్జా చిత్రంలో నటుడు నిర్మాత నవీన్, అలాగే కభీర్ దువాన్ సింగ్, మహాన్షి, కోటా శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కాట్రాజు, సుబ్బరాజు, M.కామరాజు, అవినాష్ ఇలా చాలామంది నటిస్తునారు.

More News About KABZA