Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

Slide మాగురించి గాలరి సామాజిక మాధ్యమం వార్తలు

కబ్జా సినిమా పోస్టర్ విడుదల అయింది. రియల్ స్టార్ ఉపేంద్ర స్టైలిష్ గా రెట్రో లుక్ తో జావా బైక్ మీద కూర్చున్న తీరు రియల్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు అద్భుతంగా నచ్చింది

Written by BATS Creations

September 15, 2020

Source :-

డైరెక్టర్ R. చంద్రు మాట్లాడుతూ ఇంతవరకు తను చేసిన చిత్రాలు అన్నిటినీ అధిగమించిన కబ్జా చిత్రం కథా కథనాలతోపాటు technical గా కూడా high standards లో ఉంటుందన్నారు. ముఖ్యంగా 7 భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమా గా చరిత్ర సృష్టించే విధంగా సంచలనాత్మకంగా రూపుదిద్దుకుంటుందని R. చంద్రు చెప్పారు. రియల్ స్టార్ ఉపేంద్ర కబ్జా చిత్రం అక్టోబర్ 2019 లో ప్రారంభమైంది. అడుగడుగున విభిన్నత ఉత్కంఠ నిండిన ఈ కథ 1945 1980 ఆ రోజుల్లో ఆ నేపథ్యంలో పీరియాడికల్ ఫిలిం గా ఆ కథాంశంతో నడిచే సినిమా కబ్జా. ఈ కబ్జా చిత్రంలో కథ అండర్ వరల్డ్ మాఫియా డాన్, అతని స్టొరీ తో ముడిపడి ఉంటుంది. తన అభిమానులందరూ రియల్ స్టార్ ఉపేంద్ర తో సార్ మీరు జావా బైక్ మీద కూర్చుని రెట్రో లుక్ తో స్టైలిష్ గా వచ్చిన వాల్ పోస్టర్ లో చూడముచ్చటగా ఉన్నారని తనకి చెప్పడం, రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్టర్ స్పందన తనను కొత్త అనుభూతికి లోనయ్యేలా చేసిందని రియల్ స్టార్ ఉపేంద్ర చెప్తారు. దక్షిణ భారతదేశం లో విలన్ గా పేరొందిన జగపతిబాబు కబ్జా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తుండటం విశేషం. జగపతిబాబు పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా ఉంటుంది. విభిన్నంగా ఉంటుంది. ఈ కరోనా మహమ్మారి వల్ల భారతదేశంలో చలనచిత్ర షూటింగులు అన్ని రద్దు చేయబడ్డాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కబ్జా కూడా గత ఆరు నెలలుగా షూటింగు ఆపుకోవలసి వచ్చింది. ప్రముఖ తెలుగు నిర్మాత శ్రీ లగడపాటి శ్రీధర్ రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ లో కబ్జా తెలుగు వెర్షన్ ని సమర్పిస్తున్నారు. కర్ణాటక స్టార్ డైరెక్టర్ R. చంద్రు కబ్జా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ భాషల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా 100 crores వంద కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న భారీ చిత్రం కబ్జా. రియల్ స్టార్ ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో ఈ చిత్ర కథానాయిక గా ఒక ప్రముఖ కథానాయికనే ఫైనల్ చేస్తున్నారు. కబ్జా చిత్రాన్ని బెంగుళూరు లో, హైదరాబాద్ లో, మైసూర్ లో, గుజరాత్ లో, చత్తీస్ ఘర్ లో, రామేశ్వరం లో, ఉత్తరప్రదేశ్ లో విభిన్న ప్రదేశాల్లో షూటింగ్ చేయబోతున్నారు. దాదాపు 200 రోజులు ఈ చిత్రం షూటింగ్ జరగబోతుంది.

More News About KABZA